ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు.. ఫైన్ కట్టాల్సిందేనా?

  • ఫైన్‌కు ట్రాయ్ సిద్ధమవుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ఫ్యాక్ట్ చెక్‌లో అలాంటిదేమీ లేదని తేలిన వైనం
  • విచ్చలవిడిగా పెరిగిపోతున్న నంబర్లకు అడ్డుకట్ట వేయాలని మాత్రమే ట్రాయ్ నిర్ణయం
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు కొన్నిసార్లు అయోమయం, మరికొన్నిసార్లు భయం కలిగిస్తాయి. తాజాగా, అలాంటిదే మరో ప్రచారం మొదలైంది. ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారులకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) జరిమానా విధించబోతున్నదని ప్రచారం సాగింది. ఇది చూసినవారు నిజమే కావొచ్చనని ఆందోళన చెందారు. 

నిజానికి ఇది తప్పుడు వార్త అని ‘ఫ్యాక్ట్ చెక్’లో తేలింది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న నంబర్లకు అడ్డుకట్ట వేయాలని మాత్రమే ట్రాయ్ భావిస్తోంది తప్ప ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులను ఉపయోగిస్తున్న వారికి జరిమానా విధించే ప్రతిపాదన ఏదీ లేదని తెలిసింది. కాబట్టి ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉపయోగిస్తున్న వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఉపయోగించుకోవచ్చు.


More Telugu News