నీట్ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- నీట్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
- తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు వెల్లడి
- కేంద్రమంత్రి ఖట్టర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
- పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి ముఖ్యమంత్రి
నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రేపు మరికొందరు కేంద్రమంత్రులను కలవనున్నారు. అలాగే నేడు ఆయన ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఏ ఒక్కరి పైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సీబీఐ దర్యాఫ్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడీషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని... ఇదే విషయమై తాను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఎల్‌సీ మోడల్‌లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఇళ్ళను పీఎంఏవై(యూ) కింద నిర్మిస్తామని తెలిపారు. అలాగే, స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని ఏడాది పాటు పొడిగించాలని కోరారు.
పోచారంను వెంటబెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని వెంటబెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులను కలిశారు.