హిట్ మ్యాన్ సెంచరీ మిస్... టీమిండియా భారీ స్కోరు
- టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా × ఆస్ట్రేలియా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసి టీమిండియా
- 41 బంతుల్లో 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియాలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆటే హైలైట్. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రోహిత్ స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.
మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు... శివమ్ దూబే 28 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ (0), పంత్ (15) నిరాశ పరిచారు. ఆఖరి ఓవర్లో జడేజా సిక్స్ కొట్టడంతో టీమిండియా స్కోరు 200 మార్కు దాటింది.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, స్టొయినిస్ 2, హేజెల్ వుడ్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్లో 19 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.