టీ20 వరల్డ్ కప్: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు
- నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్
- 19 బంతుల్లోనే 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ
- ఈ వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ నమోదు
- ఆరోన్ జోన్స్ రికార్డు తెరమరుగు
- 22 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన ఆరోన్ జోన్స్
టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగాడు. రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా, అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ఆరోన్ జోన్స్... 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది.
ఇవాళ రోహిత్ శర్మ ధాటికి ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బలయ్యాడు. స్టార్క్ విసిరిన ఒక ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 4 సిక్సులు, 1 ఫోర్ బాదడం విశేషం. ప్రస్తుతం టీమిండియా స్కోరు 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 75 పరుగులు. రోహిత్ శర్మ 58, రిషబ్ పంత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే (0) డకౌట్ అయ్యాడు.