నేతన్నల ఆత్మహత్యలపై.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

  • ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని విమర్శ
  • సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం తలెత్తిందన్న కేటీఆర్
  • గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని విజ్ఞప్తి 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నల ఆత్మహత్యలపై ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న నేత‌న్న‌ల‌వి ఆత్మ‌హ‌త్య‌లు కాదని... ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌లేనని విమర్శించారు. నేత‌న్న‌ల‌కు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా? అని మండిప‌డ్డారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం తలెత్తిందన్నారు.

గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆపేసింద‌ని కేటీఆర్ విమర్శించారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని కోరారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ లేఖ రాశారు.


More Telugu News