జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం
  • ఇటీవల రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
  • ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అనంతరం ముగిసిన సమావేశాలు
  • పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తున్న ప్రభుత్వం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే. ఇటీవల రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు  జరిగినా... సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో ఆ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో, పూర్తి  స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నారు. ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన రాష్ట్ర బడ్జెట్ ఆమోదానికి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 

గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై నెలాఖరుతో ముగియనుంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని తాజా బడ్జెట్ కు రూపకల్పన చేయనున్నారు. అంతేకాకుండా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, పలు ఇతర బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News