ఎలాంటి ఆర్భాటాలు వద్దన్న మంత్రి నారా లోకేశ్... వీడియోను పంచుకున్న టీడీపీ!

  • ఇవాళ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్
  • తన చాంబర్ లో నిరాడంబరంగా పదవీ బాధ్యతల స్వీకరణ
  • ప్రజా ప్రభుత్వంలో మంత్రి పదవి హోదా కాదని స్పష్టీకరణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఇవాళ ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

తన చాంబర్ లోకి అడుగుపెట్టిన లోకేశ్... కుర్చీకి కట్టి ఉన్న టవళ్లను స్వయంగా తొలగించేశారు. ఎలాంటి ఆర్భాటాలు వద్దని ఆయన తన సిబ్బందికి సున్నితంగా స్పష్టం చేశారు. నిరాడంబరంగా పదవీ బాధ్యతలు చేపట్టడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ 'ఎక్స్' లో పంచుకుంది. 

మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, తనకు కేటాయించిన శాఖల ద్వారా ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మంత్రి పదవి హోదా కాదని... రాష్ట్రాభివృద్ధి-ప్రజాసేవ చేసే బాధ్యత అని తాను భావిస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుతున్నానని ట్వీట్ చేశారు.


More Telugu News