కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక నేపథ్యంలో... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి
- సంజయ్ కుమార్ చేరికతో జీవన్ రెడ్డి మనస్తాపం
- అనుచరులతో సమావేశమైన జీవన్ రెడ్డి
- బుజ్జగింపుల కోసం జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు
తనకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని కథనాలు వస్తున్నాయి.
2014 నుంచి జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2018, 2023లలో జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ విజయం సాధించారు. మరోవైపు, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నేతలు... ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారని తెలుస్తోంది.