సముద్ర స్నానానికి వెళ్లిన మంగళగిరి యువకుల మృతి... తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
- రామాపురం బీచ్ కు వెళ్లిన మంగళగిరికి చెందిన 12 మంది యువకులు
- నలుగురు గల్లంతు కాగా... వారిలో ఇద్దరి మృతి
- మరో ఇద్దరిని కాపాడిన స్నేహితులు
- ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న నారా లోకేశ్
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
మంగళగిరికి చెందిన 12 మంది యువకులు ఇవాళ సముద్ర స్నానాల కోసం బాపట్ల జిల్లా రామాపురం బీచ్ కు వచ్చారు. అయితే, సముద్రంలో దిగిన వారిలో నలుగురు గల్లంతు కాగా, అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిని బాలసాయి, బాలనాగేశ్వరరావు (బాలు)గా గుర్తించారు. మరో ఇద్దరిని స్నేహితులు కాపాడారు.
ఈ ఘటనపై మంగళగిరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కేంద్రం కొప్పారపు కాలనీకి చెందిన పడవల బాలసాయి, కొసనం బాలు అనే యువకులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకులు ఇద్దరూ వేటపాలెం మండలంలో సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లి విషాదం మిగిల్చారని వివరించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.