అమెరికాలో బాపట్ల యువకుడి మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
- టెక్సాస్ లో కాల్పుల ఘటన
- సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గోపీకృష్ణపై దుండగుడి కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో కాల్పుల ఘటనలో మృతి చెందడం తెలిసిందే. గోపీకృష్ణ అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి, తనకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లాడు.
ఈ కాల్పుల్లో గాయపడిన గోపీకృష్ణ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. అమెరికాలో బాపట్ల జిల్లా యువకుడు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
"బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే ఓ కుర్రాడు టెక్సాస్ లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి మృత్యువాతపడిన విషయం తీవ్రంగా కలచివేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. గోపీకృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అతడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయపడుతుందని హామీ ఇస్తున్నాను. ఈ కష్ట సమయంలో గోపీకృష్ణ కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. వారు త్వరగా ఈ విషాదం నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నాం" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.