తిరుమలలో సంప్రదాయాలు పాటిస్తాం... రాజకీయాలు మాట్లాడం: హోంమంత్రి అనిత
- ఏపీ హోంమంత్రిగా నియమితురాలైన వంగలపూడి అనిత
- పదవిని చేపట్టాక తొలిసారిగా తిరుమల రాక
- అలిపిరి వద్ద గోపూజ
- హోంమంత్రిని పలకరించిన మీడియా
- ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనిత కుటుంబం
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పదవిని చేపట్టాక తిరుమలకు తొలిసారిగా విచ్చేశారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తన కుటుంబ సభ్యులతో అనిత శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో హోంమంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు, అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరం వద్ద మంత్రి అనితను మీడియా పలకరించింది. అయితే, తాము తిరుమల సంప్రదాయాలు పాటిస్తామని, రాజకీయాలు మాట్లాడబోమని అనిత స్పష్టం చేశారు. తాము దైవదర్శనం కోసం వచ్చామని, ఇప్పుడు గోపూజ చేయడానికి వెళుతున్నామని వెల్లడించారు.
ఇక, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు.