మొన్న ప్రజ్వల్ రేవణ్ణ.. నేడు సూరజ్ రేవణ్ణ.. కుటుంబం మొత్తం లైంగిక వేధింపులే
- యువకుడిని లైంగికంగా వేధించిన కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్టు
- అధికారం అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడ్డ రేవణ్ణ ఫ్యామిలీ
- తండ్రీకొడుకులు ముగ్గురిపైనా కేసులే.. ఇప్పటికే జైలులో ఉన్న ప్రజ్వల్
- బెయిల్ పై బయటకొచ్చిన తండ్రి రేవణ్ణ.. ఇప్పుడు పెద్ద కొడుకు జైలుకు
కుటుంబంలో ఎవరో ఒకరు తప్పుడు మార్గంలో వెళ్లడం అక్కడక్కడా చూస్తుంటాం.. కానీ ఆ ఫ్యామిలీలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ కుటుంబం మొత్తం అదే దారిలో నడించింది. తమ అధికారం అడ్డంపెట్టుకుని అమాయకులను, బలహీనులను లైంగికంగా వేధించారు. ఇంట్లో పనిమనిషిని తండ్రి వేధిస్తే.. చిన్న కొడుకు ఇంకో అడుగు ముందుకేసి ఆ పనిమనిషితో పాటు ఆమె కూతురును కూడా వేధించాడు. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా.. తమ సమస్యలు తీర్చుతాడనే ఉద్దేశంతో వచ్చిన మహిళలను లైంగికంగా వేధించి, వాటిని వీడియోలు తీసి దాచుకున్నాడు.
తండ్రీ, తమ్ముడిని ఆదర్శంగా తీసుకున్న పెద్ద కొడుకు ఇంకో నాలుగైదు అడుగులు ముందుకేసి ఏకంగా ఓ యువకుడిని లైంగికంగా వేధించాడు. ఆ యువకుడు కేసు పెట్టడంతో కటకటాల పాలయ్యాడు. ఇదీ కర్ణాటకలోని రేవణ్ణ ఫ్యామిలీ కథ. తండ్రి రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు రాగా.. చిన్న కొడుకు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పుడు తమ్ముడికి తోడుగా అన్న, మాజీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా జైలుకు వెళ్లాడు.
సూరజ్ పై కేసు ఇదీ..
జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన సూరజ్ రేవణ్ణ ఈ నెల 16న తనను లైంగికంగా వేధించాడని ఆ పార్టీ కార్యకర్త ఒకరు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హసన్ జిల్లాలోని వారి కుటుంబానికి చెందిన ఫాంహౌస్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే, ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చాడు. సదరు యువకుడు రూ.5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు.
సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా ఇదే విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు తనను కూడా సంప్రదించాడని, తనకు రూ.5 కోట్లు ఇప్పించకపోతే సూరజ్ పై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్లు వివరించాడు. వాస్తవానికి తనకో ఉద్యోగం ఇప్పించాలంటూ ఆ కార్యకర్త ముందుగా తనను ఆశ్రయించగా.. తాను సూరజ్ రేవణ్ణ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి కలవాలని చెప్పానన్నాడు.
తమ పార్టీ కార్యకర్త, పార్టీ కోసం కష్టపడే యువకుడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేందుకు సూరజ్ ప్రయత్నించాడని వివరించాడు. ఉద్యోగం దొరకడంలో ఆలస్యం కావడంతో ఆ కార్యకర్త తనను, సూరజ్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని శివకుమార్ ఆరోపించాడు. ఈమేరకు శివకుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.