నాటి కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉన్నాం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎండాడ న్యాయకళాశాల రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ముందుగా అనుమతుల అంశంపై కార్యాలయం గోడకు జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును చదివి, ఆ తరువాత ఆయన తొలగించారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్సీ వి. కళ్యాణి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.