సబ్బుపై కాలేయడంతో భవనం పైనుంచి జారిపడ్డ మహిళ!
- బెంగళూరు కనకనగర్‌లో తాజాగా ఘటన
- భవనం టెర్రస్‌పై గిన్నెలు తోముతూ సబ్బుపై కాలేజీ జారిపడ్డ మహిళ
- ఆమె కిందపడకుండా అడ్డుకునేందుకు భర్త విఫలయత్నం
- వాహనాలపై పడి గాయాలపాలైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలింపు
- ఐసీయూలో మహిళకు చికిత్స, ప్రాణాపాయం తప్పిందన్న పోలీసులు
సబ్బుపై కాలేసీ భవనం పైనుంచి ఓ మహిళ జారిపడ్డ అసాధారణ ఘటన బెంగళూరులో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల కథనం ప్రకారం, రుబయా అనే మహిళ (24) కనకనగర్‌లో ఉంటోంది. భనవంపై గిన్నెలు తోముతున్న సమయంలో సబ్బుపై కాలు పడి ఆమె జారింది. టెర్రస్ గోడ చిన్నంగా ఉండటంతో ఆమె భవనం పైనుంచి కింద పడిపోయింది.
మహిళ పక్కనే ఉన్న భర్త ఆమెను కిందపడకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడి చేతి పట్టు సడలడంతో మహిళ మరింత కిందకు జారింది. ఈ క్రమంలో కిటికీ పట్టుకుని వేళాడిన ఆమె చివరకు కింద నిలిపి ఉంచిన వాహనాలపై పడి తీవ్ర గాయాలపాలైంది.
అప్పటికే అప్రమత్తమైన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ మహిళకు ప్రాణాపాయం తప్పిందని, వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఘటనకు సంబంధించిన వీడియోను ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.