తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

  • వాతావరణ శాఖ వెల్లడి
  • శనివారం పలు జిల్లాల్లో వర్షం
  • ఆదిలాబాద్‌ ఉట్నూరు మండలంలో అత్యధికంగా 13.1 సెంటీమీటర్ల వర్షపాతం
  • మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7 నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది.


More Telugu News