రుణమాఫీకి సంబంధించి త్వరలో విధివిధానాలు ప్రకటిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- విడతలవారీగా కాకుండా ఏకకాలంలో రుణమాఫీ ఉంటుందన్న మంత్రి
- కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య
- రైతుబిడ్డగా తాను సంతోషిస్తున్నానన్న పొన్నం ప్రభాకర్
రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని... విడతలవారీగా కాకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు ఊరట కలిగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో తానూ భాగస్వామిని కావడం రైతుబిడ్డగా సంతోషిస్తున్నానన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని... ఆ హామీని నెరవేరుస్తున్నామన్నారు.
ఏ రోజు నుంచి రుణమాఫీ అమలు అవుతుందనేది త్వరలోనే విధి విధానాలు వస్తాయన్నారు. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేస్తామన్నారు. గతంలో విడతల వారీగా రుణమాఫీ జరిగేదని... ఇప్పుడు అలా ఉండదన్నారు. రైతు బిడ్డగా సహచర మంత్రులకు, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.