మెరిసిన పాండ్యా... టీమిండియా భారీ స్కోరు
- టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా × బంగ్లాదేశ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసిన టీమిండియా
- హార్దిక్ పాండ్యా 50 నాటౌట్
- రాణించిన రోహిత్, కోహ్లీ, పంత్, దూబే
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో బంగ్లాదేశ్ తో గ్రూప్-1 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా మరోసారి రాణించిన వేళ... టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. పాండ్యా 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోగా... టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేయగా... కోహ్లీ 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్ (6) విఫలం కాగా... శివమ్ దూబే 24 బంతుల్లో 3 సిక్సులతో 34 పరుగులు నమోదు చేశాడు. పాండ్యా, దూబే దూకుడుగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో టీమిండియాకు 62 పరుగులు లభించాయి. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్ సకీబ్ 2, రిషాద్ హుస్సేన్ 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు.