కేంద్రం విధించే సర్‌ఛార్జీలు, సెస్‌ల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది: భట్టివిక్రమార్క

  • రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో సూచనలు చేసినట్లు వెల్లడి
  • కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్ష చేయాలని కోరామన్న భట్టి
  • సర్‌ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదని సూచనలు చేసినట్లు వెల్లడి
కేంద్ర ప్రభుత్వం విధించే సర్‌ఛార్జీలు, సెస్‌ల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో సూచనలు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్ష చేయాలని కోరామన్నారు. కొన్ని కేంద్ర పథకాలపై పునఃసమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని కోరామన్నారు.

దేశంలో ప్రజల మధ్య ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్లు తెలిపారు. సర్‌ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదని తాము కేంద్రానికి సూచనలు చేశామన్నారు. నేడు ఢిల్లీలో 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి.


More Telugu News