తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారన్న మహిళ... వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- బాలిక మిస్సింగ్ కేసుపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్
- నేడు పవన్ కల్యాణ్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్న శివకుమారి అనే మహిళ
- వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం
- మిస్సింగ్ కేసుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు
ఓ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా దృష్టి సారించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వివిధ రకాల బాధితులు పవన్ కల్యాణ్ ను కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు.
భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన మైనర్ కుమార్తె గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, 9 నెలలుగా తన కుమార్తె జాడ తెలియడంలేదని శివకుమారి వెల్లడించింది.
మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించింది. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడంలేదని శివకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ మహిళ బాధను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సానుకూలంగా విన్నారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్ కల్యాణ్... వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతేకాకుండా, జనసేన పార్టీ వాహనంలోనే శివకుమారి కుటుంబ సభ్యులను, జనసేన నేతలను మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.