రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు... సమస్య అంతా ముఖ్యమంత్రితోనే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ముఖ్యమంత్రికి శాంతిభద్రతల మీద శ్రద్ధ లేదని విమర్శ
- దోపిడీలు, దాడులు, హత్యలు జరుగుతుంటే సీఎం సమీక్ష నిర్వహించడం లేదని ఆగ్రహం
- హోంశాఖ తన వద్దే ఉంచుకొని శాంతిభద్రతలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపాటు
ముఖ్యమంత్రికి శాంతిభద్రతల మీద శ్రద్ధ ఉంటే కిందిస్థాయిలోని హోంగార్డులు, కానిస్టేబుల్స్ కూడా బాగా పని చేస్తారన్నారు. కానీ ముఖ్యమంత్రి లేదా హోంమంత్రి పట్టించుకోకుండా... అధికారులకు వదిలేసినా లేక దుందుడుకు మాటలు మాట్లాడినా తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. కానీ అధికారంలో ఉన్నవారే చంపుతాం... కొడతాం... పేగులు మెడకు వేసుకుంటామని మాట్లాడటం సరికాదన్నారు. అచ్చంపేటలో దాడులు జరుగుతుంటే... ఆ దాడిని ఆపడం మానేసి... వీడియోలు తీయడం ఏమిటని ప్రశ్నించారు.
దోపిడీలు, దాడులు, హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం సమీక్షలు నిర్వహించడం లేదని విమర్శించారు. కరెంట్ పోయిందని ఎవరైనా చెబితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది ఆటవిక రాజ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. ఇక్కడ సమస్య అంతా ముఖ్యమంత్రితోనే ఉందన్నారు. హోంశాఖ కూడా తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. శాంతిభద్రతలపై ముఖ్యమంత్రికి ఆసక్తి లేదని ఆరోపించారు.