ఈ నెల 24 నుంచి లోక్ సభ సమావేశాలు... చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ
- జూన్ 24 నుంచి లోక్ సభ సమావేశాలు
- ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా లోక్ సభలో అడుగుపెడుతున్న టీడీపీ
- సార్వత్రిక ఎన్నికల్లో 16 మంది టీడీపీ అభ్యర్థుల విజయం
- టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎవరన్నదానిపై ఆసక్తి
ఈ నెల 24 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా టీడీపీ లోక్ సభలో అడుగుపెడుతున్నందున, సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున 16 మంది ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలన్న అంశంపైనా నేటి సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.