రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

  • గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై లేఖ రాసిన హరీశ్ రావు
  • ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని సూచన
  •  25 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి కట్టుబడి ఉండాలన్న హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై ఆయన ఈ లేఖను రాశారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని సూచించారు. పరీక్షల మధ్య తక్కువ వ్యవధి ఉండటంతో ఉద్యోగార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.

గ్రూప్ 2, గ్రూప్ 3కి ఉద్యోగాలను కలుపుతామన్న హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని సూచించారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్న మాటకు కట్టుబడి ఉండాలన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతిని బకాయిలు సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెప్పిన మాట ప్రకారం జీవో నెంబర్ 46ను రద్దు చేయాలన్నారు.


More Telugu News