వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్‌కి త‌ప్పిన ప్ర‌మాదం

  • క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండ‌గా జ‌గ‌న్ కాన్వాయ్‌కి ప్ర‌మాదం 
  • రామ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఆయ‌న‌ను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ప్ర‌జ‌లు
  • ఈ క్ర‌మంలో కాన్వాయ్‌లోని ఓ వాహ‌న డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేయ‌డంతో ప్ర‌మాదం
  • సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో 3 రోజుల పాటు ప‌ర్య‌టించనున్న జ‌గన్‌
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్‌కి ప్ర‌మాదం త‌ప్పింది. క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండ‌గా రామ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఆయ‌న‌ను చూసేందుకు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో కాన్వాయ్‌లోని ఓ వాహ‌న డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న ఫైరింజ‌న్ వాహ‌నాన్ని ఓ ప్రైవేట్ వెహికల్ ఢీకొట్టింది. ఎవ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిసేప‌టి త‌ర్వాత జ‌గ‌న్ తిరిగి మ‌ళ్లీ పులివెందులకు బ‌య‌ల్దేరారు. 

కాగా, జ‌గన్‌ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించనున్నారు. దీనికోసం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి శ‌నివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరారు. అక్క‌డి నుంచి క‌డ‌ప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందులకు కాన్వాయ్‌లో బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింది.


More Telugu News