‘కల్కి’ ట్రైలర్‌పై ఆర్‌జీవీ పజిల్.. గెలిస్తే రూ.లక్ష క్యాష్ ప్రైజ్ కూడా!
- ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో ‘కల్కి 2898’
- ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
- ఈ సందర్భంగా శుక్రవారం రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్
- ఈ ట్రైలర్ చూసి ఎక్స్ వేదికగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు
- నెటిజన్లకు ఈ ట్రైలర్‌పై ఒక పజిల్ ఇచ్చిన వైనం
రెబర్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన మూవీ ‘కల్కి 2898’. ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శుక్రవారం మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించాడనే చెప్పాలి. ఫైనల్ వార్ అంటూ మూవీ మేకర్స్ సినిమా విడుదలకు ఆరు రోజుల ముందు ఈ ట్రైలర్ తీసుకొచ్చారు. తొలి ట్రైలర్ లాగే ఈ రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక ఈ ట్రైలర్ చూసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ మేకర్స్‌పై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ.. నెటిజన్లకు ఈ ట్రైలర్‌పై ఒక పజిల్ ఇచ్చాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కొన్ని లెటర్స్‌ను మిస్ చేశాడు. ఈ పజిల్‌ను ఎవరైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తానని పేర్కొన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ పజిల్‌ను మీరు సాల్వ్ చేయగలరేమో ఒకసారి ప్రయత్నించండి.
‘కల్కి 2898’ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్
తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది. ‘కల్కి 2898’ మూవీ 3 గంటల 56 సెకన్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది. అయితే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ మూడు గంటల పాటు ఉండటమే మైనస్ అవుతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు వేర్వేరు ప్రపంచాల చుట్టూ తిరిగే కథే ఈ ‘కల్కి 2898’ చిత్రం అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం తెలిసిందే.