ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు: వైఎస్ జగన్
- తాడేపల్లిలో నిర్మాణంలో వున్న వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై జగన్ ట్వీట్
- ఏపీలో చంద్రబాబు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారంటూ విమర్శ
- ఒక నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారని ఫైర్
- హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారన్న మాజీ సీఎం
- దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని పిలుపు
తాడేపల్లిలో నిర్మాణంలో వున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. "ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి.
ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు.