ఖురాన్‌ను అవమానించాడని.. యువకుడిని దారుణంగా చంపి నిప్పుపెట్టిన ఇస్లామిస్టులు

  • పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన
  • పోలీస్ స్టేషన్‌పై విధ్వంసం సృష్టించి యువకుడిని లాక్కొచ్చిన జనం
  • దారుణంగా చంపి నిప్పు పెట్టిన వైనం
  • ఖండించిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంక్వాలో మూక చెలరేగిపోయింది. ముస్లింల పవిత్రగ్రంథం ఖురాన్‌ను అవమానించాడన్న ఆరోపణతో 36 ఏళ్ల టూరిస్టును చంపేసి, ఆపై మృతదేహానికి నిప్పుపెట్టింది. గురువారం సాయంత్రం స్వాత్ జిల్లాలోని మద్యాన్ పట్టణంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. పర్యాటక ప్రాంతమైన మద్యాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పంజాబ్‌(పాక్)లోని సియోల్‌కోట్‌కు చెందిన మృతుడి వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు మద్యాన్ మార్కెట్ ప్రాంతానికి వెళ్లిన పోలీసులను గుంపు అడ్డుకుని అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. 

ఆ తర్వాత వందలాదిమంది పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. పోలీస్ స్టేషన్ నుంచి యువకుడిని ఈడ్చుకొచ్చి దాడిచేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహానికి నిప్పుపెట్టారు. పర్యాటకుడి హత్యపై ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమిన్ గంగాపూర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


More Telugu News