బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్.. లోకోపైలట్ల సాహసం!

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైల్లో ఘటన
  • ఇంజెన్‌లో సమస్య కారణంగా అకస్మాత్తుగా వంతెనపై ఆగిపోయిన రైలు
  • టెక్నీషియన్లు వచ్చేందుకు ఆలస్యం కావడంతో తామే స్వయంగా రిపేర్ చేసిన లోకోపైలట్లు
  • సాహసోపేతంగా బ్రిడ్జి అంచుల వెంబడి నడుస్తూ సమస్యను పరిష్కరించిన వైనం
ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో రిపేర్లు చేశారు. వారిలో ఒకరు ఏకంగా బ్రిడ్జి మీద అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు పూర్తి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 

నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజెన్‌లోని అన్‌లోడర్ వాల్వ్‌లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిపోవడంతో రైలు నిలిచిపోయింది. అయితే, మరమ్మతు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత సమయం పడుతుందని ప్రధాన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ గుర్తించారు. దీంతో, తామే స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు సాహసం చేశారు. 

లోకోపైలట్లలో ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయగా మరో లోకోపైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతున్నట్టుగా నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతు చేశారు.


More Telugu News