నా తండ్రి నుంచి నా చిట్టి తండ్రి వరకు... అంటూ నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్
- మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్
- ఏపీ మంత్రిగా నియామకం
- నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం
- లోకేశ్ ఘనతల పట్ల సంతోషంతో పొంగిపోయిన నారా భువనేశ్వరి
మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్ నేడు తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై లోకేశ్ మాతృమూర్తి నారా భువనేశ్వరి స్పందించారు.
ప్రజాసేవలోకి వస్తాను అనే లోకేశ్ ఇష్టాన్ని అతనికే వదిలిపెట్టామని వెల్లడించారు. చిన్న వయసు నుంచి అనేక విమర్శలను ఎదుర్కొని, నేడు తనకు తానుగా అత్యధిక మెజారిటీతో మంగళగిరి నుంచి ఎన్నికవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం తీసుకువచ్చి, ప్రజలను, కార్యకర్తలను మెప్పించాడని భువనేశ్వరి కొనియాడారు.
"నా తండ్రి నుంచి నా చిట్టి తండ్రి లోకేశ్ వరకు చూసుకుంటే... ప్రజాసేవలోకి మా కుటుంబం నుంచి మూడోతరం రావడం ఆనందంగా ఉంది. తన తండ్రితో పాటు గౌరవ సభలో కూర్చునే అదృష్టం దక్కించుకోవడం పట్ల, అతడి స్వయంకృషి పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉంది" అని వివరించారు.