వివేకా హత్య కేసు విచారణ జులై 5కి వాయిదా
- నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ
- హాజరైన అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులు
- దస్తగిరి పిటిషన్ పైనా వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం
- దస్తగిరి పిటిషన్ పై విచారణ జులై 11కి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 5కి వాయిదా వేసింది. నేడు విచారణ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవాళ్టి విచారణ సందర్భంగా... సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పైనా కోర్టు వాదనలు విన్నది. సీబీఐ చార్జిషీట్ లోనూ సాక్షిగా చూపారని దస్తగిరి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దస్తగిరి పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు జులై 11కి వాయిదా వేసింది.