సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే హోంశాఖ... శాంతిభద్రతలు ఎక్కడ?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన
  • కేసీఆర్ హయాంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని వెల్లడి
  • నేరాల నియంత్రణకు సీఎం సమీక్ష జరుపుతున్నారా? అని ప్రశ్న
తెలంగాణలో శాంతిభద్రతలు కరవయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే హోంమంత్రిత్వ శాఖ వుందని... లక్షమంది పోలీసులు ఉన్నారని... కానీ శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టారన్నారు.

తెలంగాణలో ఇప్పుడు ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో దాడులు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు లేకుండాపోయాయని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. అచ్చంపేట జిల్లాలో శ్రీధర్ రెడ్డి హంతకులు దొరికే వరకు తాము పోలీసులను వదిలేది లేదన్నారు.


More Telugu News