ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు కారణాలను వెల్లడించిన ఏసీపీ రాములు
- రాత్రి 11.30 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందిందన్న ఏసీపీ
- మూడేళ్ళుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న రూపాదేవి
- ఆత్మహత్యకు ముందు భర్తకు ఫోన్ చేసిన రూపాదేవి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలను మేడ్చల్ ఏసీపీ రాములు వెల్లడించారు. రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11.30 గంటలకు రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెప్పారు.
రూపాదేవి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారని... దాదాపు మూడేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె చికిత్స తీసుకున్నారని... హోమియో మందులు కూడా వాడారని తెలిపారు. అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు.
రూపాదేవి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొప్పదండిలో ఉన్నారు. తాను తీవ్రమైన కడుపునొప్పతో బాధపడుతున్నట్లు భర్తకు తెలిపారు. దీంతో తాను వెంటనే బయలుదేరి వస్తున్నట్లు ఆయన చెప్పారు. కానీ భర్తతో ఫోన్ మాట్లాడిన తర్వాత రూపాదేవి బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.