తిరుమల శ్రీవారికి కానుకగా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం
- వెంకటేశ్వరస్వామికి హుండీ ద్వారా వాచీలు, మొబైల్ ఫోన్ల సమర్పణ
- జూన్ 24న ఆన్ లైన్ లో వేలం
- వివిధ కేటగిరీల్లో ఈ-వేలం ఉంటుందని టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన ఖరీదైన వాచీలు, మొబైల్ ఫోన్లను టీటీడీ ఆన్ లైన్ లో వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ-వేలం ప్రక్రియను జూన్ 24న నిర్వహించనున్నట్టు టీటీడీ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ భక్తులు కానుకలుగా అందించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ ఈ-వేలం ప్రక్రియలో అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది.
ఈ వాచీల్లో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్ వెల్, ఫాస్ట్ ట్రాక్ తదితర కంపెనీల వాచీలు ఉన్నాయని వివరించింది. మొబైల్ ఫోన్లలో వివో, నోకియా, కార్బన్, శాంసంగ్, మోటారోలా, ఒప్పో తదితర కంపెనీలవి ఉన్నాయని వెల్లడించింది.
వాచీలను, మొబైల్ ఫోన్లను కొత్తవి, ఉపయోగించినవి, డ్యామేజి అయినవి అనే కేటగిరీలుగా విభజించి ఈ-వేలంలో పెడుతున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.
మరిన్ని వివరాల కోసం www.tirumala.org, www.konugolu.ap.gov.in వెబ్ సైట్లను సందర్శించాలని సూచించింది.
ఇతర వివరాల కోసం 0877-2264429 ఫోన్ నెంబరు ద్వారా టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.