ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
- నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
- పలు కారణాలతో ఇవాళ అందుబాటులో లేని ముగ్గురు ఎమ్మెల్యేలు
- రేపు ఆ ముగ్గురితో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
- రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.
అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు.
రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు.