అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు
- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
- స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
- నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించిన కూటమి నేతలు
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఇక, అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అయ్యన్నపాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు.