మహమ్మద్ షమీతో సానియా మిర్జా పెళ్లంటూ వార్తలు.. ఆమె తండ్రి ఏమన్నారంటే..!
- ఈ రూమర్స్ పై స్పందించని సానియా, షమీ
- ఈ పెళ్లి పుకార్లను కొట్టిపారేసిన సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా
- ఇవన్నీ చెత్త వార్తలంటూ మండిపాటు
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఇటీవల తన భర్త షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే భారత క్రికెటర్ మహమ్మద్ షమీ కూడా తన భార్య హసీన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వ్యాపించాయి. ఆన్‌లైన్‌లో ఆ పుకార్లు షికారు చేశాయి. ఇక ఈ రూమర్స్ పై అటు సానియా గానీ, ఇటు షమీ గానీ స్పందించలేదు.
అయితే, తాజాగా ఈ పెళ్లి పుకార్లపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. షమీతో సానియా పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇదంతా చెత్త. ఇప్పటి వరకు షమీని సానియా కలవలేదు అని ఇమ్రాన్ మీర్జా ఎన్‌డీటీవీతో అన్నారు.
సానియా, షమీల విడాకులు
సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకున్నారు. దుబాయిలో కాపురం పెట్టారు. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది జనవరిలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్‌ను పెళ్లాడారు.
ఇక క్రికెటర్ మహమ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టడంతో 2018 నుంచి ఈ జంట విడిగానే ఉంటున్నారు. పేసర్‌పై అనేక ఆరోపణలు చేసిన నాలుగేళ్ల తర్వాత 2023లో కోల్‌కతా కోర్టు నెలవారీ భరణంగా భార్యకు రూ. 50వేలు ఇవ్వాలని షమీని ఆదేశించింది.