ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి పశ్చాత్తాపం.. వీడ్కోలు సందేశం విడుదల!

  • వైసీపీ హయాంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక బదిలీ
  • గురువారం కోన శశిధర్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాక వీడ్కోలు సందేశం
  • కావాలని ఎవరినీ అవమానించలేదంటూ పశ్చాత్తాపం
వైసీపీ హయాంలో విద్యాశాఖ వ్యవహారాలు చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చాక ఆయనను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో కొత్త కార్యదర్శి కోన శశిధర్‌కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాశ్ ఓ వీడియో విడుదల చేశారు. 

‘గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలలో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్నీ అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’’ అని తెలిపారు. 


More Telugu News