గన్నవరం ఎయిర్ పోర్టు రక్షణ బాధ్యతలు సీఐఎస్ఎఫ్ కు అప్పగింత

  • ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎస్పీఎఫ్ బలగాలతో భద్రత
  • తాజాగా డీజీపీకి లేఖ రాసిన ఎయిర్ పోర్టు అథారిటీ
  • ఎస్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి
  • జులై 2 నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రత
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు రక్షణ బాధ్యతలు ఇకపై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఇకపై, గన్నవరం ఎయిర్ పోర్టు రక్షణ బాధ్యతలను కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని ఎయిర్ పోర్టు అథారిటీ తాజాగా ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాధ్యతలు అందుకోనున్నారు. 

ఈ మేరకు, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఎస్పీఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ పోర్టు అథారిటీ ఏపీ డీజీపీని కోరింది. బ్యారక్ లు కూడా ఖాళీ చేయించాలని సూచించింది. జులై 2 నుంచి గన్నవరం విమానాశ్రయం రక్షణ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.


More Telugu News