లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్
- ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
- రాజ్యాంగంలోని ఆఱ్టిల్ 95(1) ప్రకారం నియామకం
- కటక్ లోక్ సభ స్థానం నుంచి గెలిచిన భర్తృహరి
లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ పార్లమెంటేరియన్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఆయనను నియమించారు. భర్తృహరి ఒడిశాలోని కటక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో సమీప బీజేడీ అభ్యర్థి సంత్‌రుప్త్ మిశ్రాపై 57 వేల పైచిలుకు మెజార్టీతో ఆయన గెలిచారు. ఆయన 1998 నుంచి 2019 వరకు బీజేడీ తరఫున వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2017లో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును దక్కించుకున్నారు. 2017, 2018, 2019 ఏడాదిలలో వరుసగా ఆయన సన్సద్ రత్న అవార్డును గెలుచుకున్నారు.