ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్... 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • టీ20 వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
  • సూపర్-8 దశలో ప్రస్థానం ప్రారంభించిన టీమిండియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో టీమిండియా నేడు మొదటి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో ఆడుతోంది. బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, 62 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలోనే అవుటయ్యాడు. 8 పరుగులు చేసిన రోహిత్... ఆఫ్ఘన్ లెఫ్టార్మ్ పేస్ ఫజల్ హక్ ఫరూఖీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

ఇక, వన్ డౌన్ లో వచ్చి దూకుడుగా ఆడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రివర్స్ స్వీప్ చేసే యత్నంలో పంత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 

ఆ తర్వాత విరాట్ కోహ్లీ (24) కూడా రషీద్ ఖాన్ కు వికెట్ అప్పగించాడు. ఓ భారీ షాట్ కొట్టబోయి నబీకి క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా మూడో వికెట్ చేజార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 ఓవర్లలో 3 వికెట్లకు 67 పరుగులు కాగా... సూర్యకుమార్ యాదవ్ 6, శివమ్ దూబే 1 పరుగుతో ఆడుతున్నారు.


More Telugu News