'వందే భారత్' రైలు భోజనంలో బొద్దింక... క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ

  • వందే భారత్ భోజనంలో బొద్దింకను గుర్తించినట్లు నెటిజన్ ట్వీట్
  • ఇలాంటి భోజనం సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతామని హామీ
వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక వచ్చింది. ఇందుకు సంబంధించి విదిత్ వర్ష్‌నే అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన బంధువులు భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్నారని... రైల్వే సిబ్బంది తీసుకువచ్చిన భోజనంలో బొద్దింకను గుర్తించారని పేర్కొన్నారు. ఇలాంటి భోజనాన్ని సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐఆర్‌సీటీసీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేస్‌ను ట్యాగ్ చేస్తూ విదిత్ ట్వీట్ చేశారు. భోజనంలో బొద్దింక కనిపించిన ఫొటోను కూడా షేర్ చేశారు.

స్పందించిన ఐఆర్‌సీటీసీ

నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. 'మీ బంధువులకు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయంలో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతాం. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం' అన్నారు.


More Telugu News