అమరావతి రాజధాని మాత్రమే కాదు...!: సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రి హోదాలో నేడు అమరావతిలో పర్యటించిన చంద్రబాబు
- పలు ప్రాంతాలను సందర్శించి ఆవేదన వ్యక్తం చేసిన వైనం
- వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆశలను చిదిమివేసిందని వ్యాఖ్య
- అమరావతి రాజధాని అనేది దైవ నిర్ణయం అంటూ ట్వీట్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రాజధాని శంకుస్థాపన శిలాఫలకం, నిలిచిపోయిన అనేక భవన నిర్మాణాలను పరిశీలించారు. తన పర్యటనపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
"అమరావతి రాజధాని మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు ఉమ్మడి ప్రతిరూపం. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆశలను చిదిమేసింది. రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. రాజధానిని నాశనం చేసింది. ఈ పరిణామాలు తీవ్ర వేదనకు గురిచేశాయి.
ఇవాళ నేను అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేశాను. అమరావతి పునర్ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించాం. అమరావతి రాజధాని అనేది దైవ నిర్ణయం. విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే దైవ మహిమతో రాజధాని పనులు మళ్లీ మొదలయ్యాయి" అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.