రేపు అసెంబ్లీలో మొదట చంద్రబాబు ప్రమాణం చేస్తారు: మంత్రి పయ్యావుల
- రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- జూన్ 21, 22 తేదీల్లో సభ సమావేశాలు
- ఈ రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో... ప్రొటెం స్పీకర్ నియామకం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
దీనిపై ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. మొదట సీఎం చంద్రబాబు ప్రమాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తారని పయ్యావుల పేర్కొన్నారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని వివరించారు.
అక్షర క్రమం ప్రకారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల సీటింగ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, వైసీపీ సభ్యులందరూ ఒకే చోట కూర్చుంటారని తెలిపారు. రేపు, ఎల్లుండి అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల వెల్లడించారు.