రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోయాయి: రఘునందన్ రావు

  • గురువారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను కలిసిన ఎంపీ
  • మెదక్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి
  • రైల్వే పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పూర్తి చేయాలని సూచన
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోయాయని మెదక్ లోక్ సభ సభ్యుడు రఘునందన్ రావు విమర్శించారు. గురువారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను కలిశారు. మెదక్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఆరోపించారు. రైల్వే పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పూర్తి చేయాలన్నారు.


More Telugu News