రాజ్ భవన్‌లో నాకు భద్రత లేదు... పోలీసులు నిఘా పెట్టారు: బెంగాల్ గవర్నర్
- విధుల్లో ఉన్న ఇంఛార్జ్ అధికారి, ఆయన బృందంతో భద్రతకు ముప్పు ఉందన్న గవర్నర్
- తాను చేసే ఆరోపణలకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి
- ఈ విషయమై తాను సీఎంకు సమాచారం ఇచ్చినా చర్యలు లేవని ఆవేదన
రాజ్ భవన్‌లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందన్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇంఛార్జ్ అధికారి, ఆయన బృందం వల్ల తన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందన్నారు.
తాను ఇలా ఆరోపించడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమాచారం ఇచ్చానని వెల్లడించారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
తన అధికారిక నివాసంలోని పోలీస్ సిబ్బంది తనపై నిఘా పెట్టారని గవర్నర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల పోలీసులు ఇలా చేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు.