నేడు క్లీంకార కొణిదెల తొలి పుట్టిన రోజు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన ఉపాసన

  • నేడు క్లీంకార మొదటి బర్త్ డే
  • ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ఉపాసన
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
నేడు మొదటి పుట్టినరోజు జరుపుకొంటున్న మెగా హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు మెగా అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. క్లీంకార రాకతో తమ జీవితాలు పరిపూర్ణమయ్యాయని పేర్కొన్నారు. ఈ వీడియోను తాను ఇప్పటి వరకు మిలియన్ సార్లు చూసినట్టు తెలిపారు. తమ జీవితాల్లో ఆనందం నింపినందుకు క్లీంకారకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, ఉపాసన సహా పలువురు కుటుంబ సభ్యులు మాట్లాడారు. క్లీంకార తమ కుటుంబంలోకి రావడానికి ముందు, ఆమె గురించి తామెంతలా ఎదురుచూస్తున్నామో అందులో చెప్పుకొచ్చారు. ఈ వీడియోలోనే చెర్రీ-ఉపాసన పెళ్లి, క్లీంకార నామకరణ వేడుకకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి.


More Telugu News