జగన్ దోపిడీ చూసి యావత్ దేశం షాకయ్యింది: నారా లోకేశ్

జగన్ దోపిడీ చూసి యావత్ దేశం షాకయ్యింది: నారా లోకేశ్
  • రుషి కొండ ప్యాలెస్ కాంట్రవర్సీపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • పేదల సొమ్ముతో జగన్ తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారని మండిపాటు
  • ఈ అంశంపై ఎంక్వైరీ జరిపించి, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ
ఏపీలో రుషి కొండ ప్యాలెస్ సంచలనం సృష్టిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మారిన తరువాత రుషి కొండ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు బహిర్గతమై రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. 

కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూడా జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగమైంది నిజమే అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రుషి కొండ ప్యాలెస్ కాంట్రవర్సీపై జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ మంత్రి, టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ స్పందించారు. జగన్ దోపిడీ యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసిందని అన్నారు. 

‘‘తమ పిల్లలకు ఓ గూడు కల్పించేందుకు పేదలు అలమటిస్తుంటే జగన్ మాత్రం ప్రజాధనంతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆయన దోపిడీ.. యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేశాయి. ఈ విషయంలో ఎంక్వైరీ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తాము. ఈ భవనం ప్రజలకు చెందేలా చేస్తాము’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 


More Telugu News