సఫారీలపై పోరాడి ఓడిన అమెరికా
- అంటిగ్వా వేదికగా అమెరికా, దక్షిణాఫ్రికా తొలి సూపర్-8 మ్యాచ్
- 18 పరుగుల తేడాతో యూఎస్‌పై దక్షిణాఫ్రికా విజయం
- 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన సఫారీలు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులకే పరిమితమైన అమెరికా
- 80 పరుగులతో ఆండ్రియాస్ గౌస్ ఒంటరి పోరాటం
టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 పోరు ప్రారంభమైంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అమెరికా, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. అంటిగ్వా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరివరకు పోరాడిన పసికూన అమెరికా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో క్వింటన్ డి కాక్ అర్థ శతకంతో రాణించాడు. కేవలం 40 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46), హెన్రిచ్ క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. యూఎస్ బౌలర్లలో నెత్రవాల్కర్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన యూఎస్ జట్టు పోరాడి 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా బ్యాటర్లలో వికెట్ కీపర్, బ్యాటర్ ఆండ్రియాస్ గౌస్ 80 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. 47 బంతులు ఎదుర్కొన్న గౌస్ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో అజేయంగా 80 పరుగులు చేశాడు. చివరలో హర్మీత్ సింగ్ 22 బంతుల్లో 38 రన్స్ తో బ్యాట్ ఝుళిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో అమెరికాకు పరాజయం తప్పలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయడంతో యూఎస్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. సఫారీ బౌలర్లలో కసిగో రబాడ 3 వికెట్లు తీస్తే.. కేశవ్ మహరాజ్, నోకియా, షంసీ చెరో వికెట్ పడగొట్టారు.