షూటింగ్‌లో గాయపడిన నటి ప్రియాంక చోప్రా

  • ప్రియాంక కీలక పాత్రలో 'ది బ్లఫ్' సినిమా షూటింగ్
  • ఆస్ట్రేలియాలో గాయపడిన ప్రియాంక చోప్రా
  • చికిత్స నిమిత్తం సిడ్నీలోని ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ఫొటోను చూస్తే ఆమె ముఖం, మెడపై గాయాలు అయినట్లుగా ఉంది.

'వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం' అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియాంక గాయపడటంతో చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆమెను సిడ్నీలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.


More Telugu News