మక్కాలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!
- భారత్ నుంచి వచ్చిన వారూ మృతి చెందినట్లు గుర్తించామన్న సౌదీ దౌత్యవేత్త
- సహజ మరణం... వృద్ధాప్యం కారణంగా మృతి చెందినవారు కూడా ఉన్నట్లు వెల్లడి
- కొంతమంది వాతావరణ పరిస్థితుల కారణంగా మృత్యువాత పడ్డారని వెల్లడి
హజ్ యాత్రకు వచ్చి ఈ సంవత్సరం 600 మందికి పైగా మృతి చెందారని, అందులో 68 మంది భారతీయులు ఉన్నారని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఒకరు బుధవారం వెల్లడించారు. భారత్ నుంచి వచ్చిన వారిలో 68 మంది మృతి చెందినట్లు గుర్తించామన్నారు. ఇందులో కొందరు సహజంగా, మరికొందరు వృద్ధాప్యం కారణంగా మృతి చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకొంతమంది వాతావరణ పరిస్థితుల కారణంగా మృత్యువాత పడినట్లు చెప్పారు.
ఈ ఏడాది హజ్ యాత్రలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వేడిని తట్టుకోలేక 550 మందికి పైగా మృతి చెందినట్లు మంగళవారం అరబ్ ప్రతినిధులు తెలిపారు. మక్కాలో ఉష్ణోగ్రతలు దాదాపు 52 డిగ్రీలుగా నమోదైంది. మృతి చెందినవారిలో ఈజిప్ట్, సౌదీ అరేబియాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎండవేడిని తట్టుకోలేక మరో 2,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.