వైసీపీకి షాక్... నెల్లూరులో పార్టీకి సీనియర్ నేత రాజీనామా
- వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రామిరెడ్డి
- ఆదాల మోసగాడు... పెద్దమనిషి ముసుగేసుకున్న నయవంచకుడని విమర్శ
- కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డిపై తమతో విషప్రచారం చేయించారన్న రామిరెడ్డి
- ఎన్నికల్లో పని చేసిన కార్యకర్తలను ఆదాల గాలికి వదిలేశారని ఆరోపణ
సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం నెల్లూరు రూరల్ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవీ రామిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 'ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు... పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఓ నయవంచకుడు' అంటూ తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నలభై ఏళ్లుగా తనకు మంచి స్నేహితుడన్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి అని... అందుకే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు.
రూ.2 కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి విషప్రచారం చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై తమతో దుష్ప్రచారం చేయించారన్నారు. నాడు దుష్ప్రచారం చేసినందుకు కోటంరెడ్డిని వైవీ రామిరెడ్డి బహిరంగంగా క్షమాపణ కోరారు. ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం పని చేసిన కార్యకర్తలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇలాంటి నాయకుడు రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. ఆదాలకు కార్యకర్తల ఉసురు తగులుతుందన్నారు.